నేటి గదర్, జూలై 22,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47.60 అడుగులకు చేరుకుంది. సోమవారం ఉదయం 8 గంటలకు 47.10 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి 4 తర్వాత 0.50 అడుగులు పెరిగింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 11,22,985 క్యూసెక్కులు వరద ప్రవాహం కొనసాగుతుంది.
Post Views: 74