★510 జీవో అందరికి అమలు చేయాలి లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తాం.
★జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా -(ఏఐటీయూసీ అనుబంధం)
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ (ఆసిఫాబాద్ జిల్లా):
జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న వివిధ రకాల సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
అసిఫాబాద్ లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో జిల్లా మహాసభ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు సవరించి పెంచకుండా గత ప్రభుత్వం లాగానే దాట వేస్తుందని, వెంటనే కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ …అనేక పోరాటాల వల్ల సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్, పెట్టుబ డిదారులకు మేలు చేస్తున్న కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రకటించటం ఎన్డీయే ప్రభుత్వ విధానాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. నాలుగవ తరగతి సిబ్బంది కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, జాతీయ ఆరోగ్య మిషన్ పని చేస్తున్న 17514 మందికి శ్రమ దోపిడికి గురవుతూ పేద ప్రజల ఆరోగ్యమే పరమావదిగా భావించి పని చేస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించకుండా కాలయాపన చేయటాన్ని ఆయన విమర్శించారు. ఈఎస్ఐ సౌకర్యం, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు,510 జీవోని అందరికి అమలు చేయాలని, ప్రమాద భీమా 25 లక్షలు ఇవ్వాలని, దురదృష్ట వశత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోపు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలని అన్నారు, జూలై 24 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు,ప్రతి రోజు ఒక యూనియన్ వారి సమస్యల పరిష్కారానికై ఇందిరాపార్కు వద్ద ధర్నాలు నిర్వహించి మంత్రులకు, అధికారులకు మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించటం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్. సురేష్ నాయక్, జనగాం జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కొండ్ర లత, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, ఉపాధ్యక్షుడు మధుకర్, నాయకులు చిరంజీవి,వినోద్, స్రవంతి, పైసా శ్రావణ్, ముస్తక్, శ్రీనివాస్, గోపి కృష్ణ, సాయిలత,మ్రిదుల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
■కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక■
జాతీయ ఆరోగ్య మిషన్ నూతన కమిటీ ఎన్నుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు
NHM జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్(ఏఐటీయూసీ),జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు గా గ్యార వినోద్, MD షకీల్,ఉపాధ్యక్షుడు ఏ. చిరంజీవి,గోపి కృష్ణ, చంద్రకళ,జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిపెళ్లి మధుకర్,సహాయ కార్యదర్శి ముస్తాక్,బి.శ్రీదేవి,సాయిలత,కోశాధికారి సంగీత లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.