★136 ప్రజావాణి దరఖాస్తులు స్వీకరణ
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్):
సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలి కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు. వివిధ ప్రజలు పెట్టుకున్న136 అర్జీలను వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు-18,ధరణి భూ సమస్యలు-36,పింఛన్లు కొరకు-08,రుణమాఫీ-07, ఇతర సమస్యలు-67 ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు.
Post Views: 122