◆అంగన్ వాడి కేంద్రాల్లో 3వ తరగతి వరకు విద్యాబోధన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
◆ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గూగులోత్ వంశీ
నేటి గదర్ న్యూస్,జూలూరుపాడు:కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలి అని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గూగులోత్ వంశీ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం జూలూరుపాడు లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు 2024- 2025 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని, కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.దేశంలో ,రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పరిరక్షణకు, ప్రభుత్వ విద్య బలోపేతం చేసే విధంగా నిధుల కేటాయింపులు జరగాలని అన్నారు.మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా విద్యకు సరైన నిధులు ఇవ్వలేదని ఈ బడ్జెట్ లోనైనా విద్యకు అధికంగా నిధులు కేటాయించాలని ,తెలంగాణ విభజన హామీల ప్రకారం తెలంగాణలో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఐఐఐటీ,ఐఐఎం లాంటి అనేక విద్యాసంస్థలు తెలంగాణ లో ఏర్పాటు చేయాలని అన్నారు.విభజన చట్టం లో ఉన్న ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని ఈ బడ్జెట్లో విభజన చట్టంలో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణకి కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నిధులు కేటాయించిందని, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్లో విద్యకు 30% కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉంది కాబట్టి సిఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యాత ఇచ్చి రాష్ట్రంలోని యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచే విధంగా , పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ ,బకాయిలు విడుదల చేసే విధంగా నిధుల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్ వాడి కేంద్రాల్లో మూడవ తరగతి వరకు విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ఈ నిర్ణయం వల్ల బీజేపీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 ని రాష్ర్టంలో అమలు చేసినట్లు అవుతుందని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ విద్య లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నర్సరీ ఎల్కేజీ విద్యార్థులు ప్రైవేట్ వాటిల్లో చేరుతున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ విద్య ప్రారంభించాల్సింది పోయి అంగన్ వాడి కేంద్రాల్లోనే మూడవ తరగతి వరకు విద్య చదువుకొని తర్వాత ప్రభుత్వ పాఠశాలలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. బిజెపి తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పూర్తిగా లోపాల పుట్టఅని ఈ జాతీయ విద్యా విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకించిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని గుగులోత్ వంశి డిమాండ్ చేశారు.లేని యెడల తమ సంఘం ఆధ్వర్యంలో ఉవ్వెత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు