.
నేటి గదర్ కరకగూడెం:మండలం లోని గత మూడు రోజుల క్రితం కురుస్తున్న వర్షాల వల్ల సిఐ వెంకటేశ్వరావు తక్షణమే స్పందించి అక్కడి వాగులు, వంకలను పరిశీలించారు. వరద ముప్పు పెరగడంతో స్థానిక ప్రజల భద్రత కోసం ఆయన అనేక చర్యలు చేపట్టాలని కోరారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించి, తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని సిఐ వెంకటేశ్వరావు స్థానిక అధికారులతో కలిసి వాగులు, వంకల పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టారు. వర్షాల తీవ్రత తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ చర్యలు వలన వర్షాల ప్రభావం తగ్గించి, ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఎడుళ్ళ బయ్యారం ఎస్ఐ రాజుకుమార్,కరకగూడెం ఎస్ఐ రాజేందర్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
Post Views: 37