★పాలెం వాగు ప్రాజెక్ట్ నీళ్లు ఇవ్వండి
★పోడు రైతుల పైన అటవీ శాఖా అధికారులను వేధింపులు అరికట్టండి..
★వ్యవసాయ బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలి
నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం:
స్త్రీ శిశు సంక్షేమ శాఖా, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి దనసరి అనసూర్య వెంకటాపురం రావడం జరిగింది. మంత్రిని కలిసి
షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు అమలు కావడం లేదని అందుకు తగు చర్యలు తీసుకోవాలని ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చారు. పోడు రైతుల పైన అటవీ శాఖా అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆయన మంత్రి కి వివరించారు.అటవీ శాఖా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రామచంద్ర పురం ఆదివాసీల స్వాధీనం లోని భూమిని రెవిన్యూ అధికారులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి అటవీ శాఖకి అక్రమంగా అప్పగించారని తెలియ జేశారు. సాగులో ఉన్న ఆదివాసీలకు పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. పాలెం వాగు ప్రాజెక్ట్ కాలువలు మరమత్తులు చేయక పోవడం కారణంగా బర్లగూడెం గ్రామపంచాయతీ కి సాగు నీళ్లు రావడం లేదని, తక్షణమే నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. హన్మకొండ ఉంటూ జీతాలు తీసుకుంటున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రధాన రహదారి పైన బ్రిడ్జి నిర్మించాలని అన్నారు. ఇసుక ర్యాంపుల్లో గిరిజనేతరులు గొడవలు సృష్టిస్తూ గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మంత్రి కి తెలిపారు. పెసా చట్టం ప్రకారం గిరిజనులే ఇసుక క్వారీలో ఉపాధి పొందాలని అన్నారు. గిరిజనులకు లభించిన చట్ట బద్ధమైన ఉపాధిని కాజేయడానికి గిరిజనేతరులు చూస్తున్నారని అన్నారు. ఇసుక క్వారీ ల్లో పని చేసే గిరిజనులకు ప్రత్యేకమైన రక్షణ చర్యలు చేపట్టాలని నర్సింహా మూర్తి మంత్రి సీతక్కను కోరినారు. సిఎంగిరి వికాస్ పథకం ద్వారా వేసిన వ్యవసాయ బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని అన్నారు. బోర్లు వేసి రెండు ఏళ్ళు అవుతున్న విద్యుత్తు సౌకర్యం అధికారులు కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమం లో రామచద్రపురం, చిరుతపల్లి, సూరవీడు, కొండాపురం గ్రామాలకు చెందిన ఆదివాసీలు పాల్గొన్నారు.