కాంగ్రేస్ జిల్లా నాయకులు బత్తుల అంజి
ములకలపల్లి. జులై 22.నేటిగద్దర్ న్యూస్.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ములకలపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజి జెడ్పిటిసి బత్తుల అంజి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిందని
కావున మండల ప్రజలు ఎవరు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
వాగుల వంకలు దాటుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రమాదాలు సంభవించే సమయంలో అధికారులకు వెంటనే సమాచారం అందించాలని,వరదల సమయంలో బాధితులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటి,మండల కమిటీ ఆధ్వర్యంలో సేవలు అందించాడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Post Views: 44