ములకలపల్లి. జులై 22.నేటిగద్దర్ న్యూస్.మండలంలోని కమలాపురం గ్రామపంచాయతీలో ఇటీవల కురిసిన వర్షలకు వీధి రోడ్ల చెరువులు తలపిస్తున్నాయి.ఇలాంటి రోడ్లపై ఎలా నడవాలని గ్రామ ప్రజలు అధికారులను ప్రశ్నింస్తున్నారు. ఇలాంటి దుస్థిని గ్రామపంచాయతీ అధికారులు,పంచాయతీ స్పెషలాఫీసర్ గ్రామానికి సందర్శించి ఇకపై రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని జనసేన పార్టీ నాయకులు తెలియజేసారు. ఈ సందర్బంగా కమలాపురం గ్రామపంచాయతీ కి చెందిన గొల్ల వీరభద్రం మాట్లాడుతూ వీధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు అంతేకాకుండా అక్కడ నీరు నిలిచి ఉండడంతో దోమల విజృంభణ ఎక్కువగా ఉండడంతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని,కావున పంచాయతీ అధికారులు ఇకనైనా ఇటువంటి సమస్యను తలెత్తకుండా చూడాలని త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో ములకలపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్,ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు,జిల్లా నాయకులు గరిక రాంబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.