మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం వద్ద మాదాపురం కు చెందిన మాజీ ఎంపిటిసి దంపతులు ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇరువురికి గాయాలు అయ్యాయి. ఇదే సమయం లో నేలకొండపల్లి పర్యటనకు వెళ్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఆపి క్షతగాత్రులను ప్రమర్శించి ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాలని తెలిపారు ,పలుమార్లు ఇలాంటి మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీనివాసరెడ్డి ని జిల్లా ప్రజలు కొనియాడారు.
Post Views: 485