రైతు రుణమాపి గ్రహీతలను నేరుగా కలిసిన ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా జే డీ ఏ విజయనిర్మల లక్ష లోపు ఋణం తీసుకున్న రైతుల మనోభావాలు తెలుసుకుందాము అని నేరుగా ఖమ్మం జిల్లా తనికెళ్ళ గ్రామం లొ కొందరు ఋణ గ్రహీతలను నేరుగా సోమవారం సాయంత్రం కలవటం జరిగింది. దేనిలో భాగంగా సంగీపు సక్కుబై కి 0.20 కుంటలు భూమి వుంది, తనికెళ్ళ గ్రామీణ వికాస్ బ్యాంకు నందు వారికీ 50330 రుణమాపీ రావటం జరిగింది అన్నారు. వారు చాలా సంతోషం గా వున్నాము, ఈ డబ్బులతో పొలానికి కరంట్ మోటార్ పెట్టుకోవటం జరిగింది, ప్రభుత్వానికి రుణపడి వున్నాము అన్నూరు.
గుమ్మిడెల్లి. రామారావుకి 0.23 కుంటలు భూమి వుంది వారికీ 46236 రుణమాపీ అయంది అన్నారు, తాను వున్నా పొలం తో పాటు కొంత కావులుకి తీసుకున్నాను నాకు పెట్టుబడికి మంచి సమయానికి అందించిన ప్రభుత్వానికి ధన్యవాదములు అన్నారు. కొల్లూరి. వెంకటప్పయ్యకి 0.30 కుంటలు భూమి వుంది వీరికి కూడా 63000 వరకు రుణమాపీ అయంది అన్నారు, తాని కోడలు అకాలమరనామ్ ఇంట్లో ఆర్ధిక ఇబంధుల్లో వున్నా సమయం లొ మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నారు అన్నారు అని తన సంతోషంన్ని తెలియపరిచారు. కొల్లూరి నాగేశ్వరావు కి 0.30 కుంటలు భూమి వుంది ఈ రైతుకి కూడా 42560 రుణమాపీ అయంది అని అన్నారు.
రుణమాపీ అయిన రైతులను జిల్లా వ్యవసాయం అధికారి, ప్రజల మనోభావాలు తెలుసుకుందాము అని రాత్రి సమయం లొ రైతులు అందరు వుంటారు అని నేరుగా రైతులను కలవటం జరిగింది వారు ఋణ మాపి ఇంత త్వరగా చేస్తారు అనుకోలేదు, కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషం గా వుంది రైతులను ఆదుకున్న ప్రభుత్వం గా రైతులు కొనియాడారు ఈ కార్యక్రమం లొ జె డి ఏ విజయనిర్మల, జే డి ఏ ఆఫీస్ ఏ డి ఏ టెక్నీకల్ ఆఫిసర్ శ్రీనివాసరెడ్డి ,ఏం ఏ ఓ బాలాజీ, ఏఈవో శ్రీనివాసరాజు, మరియు రైతులు పాల్గున్నారు