నేటి గదర్ న్యూస్ జులై 22: వైరా నియోజకవర్గప్రతి నిధి శ్రీనివాసరావు.
కామేపల్లి:- సీతారామ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేయాలి అని, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో గుండా బిక్షం రెడ్డి భవన్లో జరిగినసమావేశంలో ఆయన మాట్లాడినారు. భూ నిర్వాసితులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వజ్జా రామారావు అధ్యక్షతన జరిగిన కామేపల్లి, కారేపల్లి మండలాల రైతు సంఘం సమావేశంలోబొంతు రాంబాబు తో పాటు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ కూడా మాట్లాడారు.
2005 డిసెంబర్ 31 న శంఖుస్థాపన జరిగిన దుమ్ముగూడెం ప్రాజెక్ట్ 20 సంవత్సరాల కాలంలో పూర్తి చేయకపోవడం ప్రభుత్వాలు వైఫల్యం అన్నారు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ పేర్లు మార్పిడి తప్ప సాగునీరు అందించిన పరిస్థితి లేదని రోళ్లపాడు అనుసంధానం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాల భూమి కి సాగునీరు అందించే ప్రాజెక్టు తగినన్ని నిధులు కేటాయింపు లేకపోవడంతో పూర్తి కాలేదని అన్నారు.
పాప కోలు గుట్టల ప్రాంతంలో ప్రధాన కాలువలు నిర్మాణం ఆగిపోయింది, తక్షణమే ప్రధాన కాలువలు పనులు ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించాలి అని కోరారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి అవసరమైన పద్దతి లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు .
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు, రైతు సంఘం సినీయర్ నాయకులు ఇంజం నాగభూషణం, రైతు సంఘం కామేపల్లి మండల అధ్యక్షులు రాయల సత్యనారాయణ, కార్యదర్శి సకినల శ్రీనివాసరావు, సిపిఎం కారేపల్లి మండల కార్యదర్శి కుందనపల్లి నరేంద్ర, కామేపల్లి మండల కార్యదర్శి అంబటి శ్రీనివాసరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం నాయకులు వెంకన్న, రామనాధం తదితరులు పాల్గొన్నారు