★రుణమాఫీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
★జిల్లాలో పటిష్ట ప్రణాళిక నడుమ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందాలి
★రుణమాఫీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు పగడ్బందీగా చర్యలు
★బూరుగుపల్లి ఎస్బిఐ బ్రాంచ్ వద్ద రుణమాఫీ పై రైతుల నుండి సమస్యలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
పటిష్ట ప్రణాళిక నడుమ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు అమలవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత లీడ్ బ్యాంక్ మేనేజర్ తో కలిసి హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి ఎస్బిఐ బ్రాంచ్ వద్ద రుణమాఫీ పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూరుగుపల్లి ఎస్బిఐ బ్రాంచ్ లో 391 అకౌంట్లు కలవని ఇప్పటివరకు 367 మంది రైతులకు రుణమాఫీ అమలైందని తెలిపారు.రైతు రుణ మాఫీ పై క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుని తద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.రైతుల రుణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నారు బకాయిలు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ జరుగుతుందన్నారు.
రైతులు రుణమాఫీ జరగలేదని ఎవరు ఆధైర్య పడవద్దని విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకు మేనేజర్స్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహమూర్తి బూరుగుపల్లి ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ సంబంధిత వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.