నేటి గదర్, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ 9052354516 :
భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం ఉదృతంగా ఉండడంతో పాటు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహిస్తున్నడంతో రెండవ ప్రమాద హెచ్చరిక అమలులోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.00 అడుగుల మేరకు ప్రవహిస్తుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 51.30 అడుగుల వరకు ప్రవహిస్తూ గత 3 రోజుల నుండి నిదానంగా పెరుగుతూ వచ్చిన గోదావరి, 12 గంటల నుండి స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. గడిచిన చివరి రెండు గంటలలో 0.30 అడుగులు గోదావరి ప్రవాహం తగ్గిందని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్యలు ఉంటే వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 589