నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి జులై 23:
నైనారపు నాగేశ్వరరావు ✍️
భారత ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.విభజన హామీలను నెరవేరుస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టుగా తెలిపారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామమని హామీ ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రాయలసీమ,ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు.విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి సాయం చేస్తామన్నారు.ఏపీలో గ్రామీణాభివృద్ధి పథకాలకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు.కొప్పర్తి,ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల నిర్మాణానికి ప్రత్యేక సహకారం చేస్తామని హామీ ఇచ్చారు.
“తెలంగాణకు కేంద్రం మొండిచేయి”
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారు. రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించలేదు.సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లి కోరినా మోదీ సర్కారు దయ చూపలేదు.
హైదరాబాద్,బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని మాత్రమే బడ్జెట్‌లో ప్రస్తావించారు.మిగతా రంగాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవని తెలుస్తోంది.