నేటి గదర్, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాచలం గోదావరి ముంపు పరివాహక ప్రాంతాలలో నెలకొని ఉన్న 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు అప్రమత్తంగా ఉండి 24 గంటలు ముంపునకు గురి అయ్యే ప్రజలకు సేవలు అందించాలని గోదావరి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ వైద్యులకు సూచించారు. మంగళవారం నాడు ఐటిడిఏ కార్యాలయంలోని అదనపు వైద్య శాఖ అధికారి చాంబర్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా ముంపు ప్రాంతాలలో పనిచేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరద తాకిడికి, ముంపునకు గురి అయ్యే గ్రామాల ప్రజలను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా వారిని ముందుగానే గుర్తించి, దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేర్పించి డెలివరీ అయ్యే వరకు తగు జాగ్రత్తలు తీసుకొని వైద్య పరీక్షలు చేస్తూ ఉండాలని అన్నారు. గ్రామాలలోని గిరిజన ప్రజలకు వైరల్ ఫీవర్ పట్ల అలసత్వం వహించకూడదని, అందరికీ రక్త పరిక్షలు చేసి తగినన్ని మందులు అందించాలని, పునరావాస కేంద్రాలలో ఉండే కుటుంబాలకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన డాక్టర్లకు ఆదేశించారు. వరద తాకిడికి గురి అయిన గ్రామాలలో తప్పనిసరిగా బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని, దోమల మందు పిచికారి చేయాలని, గ్రామాలలో మురికి నీరు నిలువ ఉండకుండా చూసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలాజీ, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.