+91 95819 05907

గత పాలకులవి పచ్చి అబద్దాలు:CPI

– గోదావరి ముంపుకు శాశ్వత పరిష్కారం చూపుతామని మోసం

– కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపాలి

– పెద్దవాగు ప్రాజెక్టు గండి బిఆర్ఎస్ తప్పిదమే

– వరదలు, వర్షాలతో నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవాలి
. కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి.

-సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

నేటి గదర్ న్యూస్ , భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి : పదేళ్లపాటు పరిపాలన సాగించిన గత పాలకులు పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రథానంగా గోదావరి ముంపు ప్రాంతాలకు ప్రత్యేక కాలనీలు కట్టించి శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చి వంచనకు గురిచేశారని, 2022 గోదావరి వరదల సమయంలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన నోటిద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారని సిపిఐ జిల్లా కార్యదర్శిఎస్ కె సాబీర్ పాషా అన్నారు. గోదావరి వరదలు, వర్షాల కారణంగా ఇబ్బందుల్లో పడిన భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన సిపిఐ ప్రతినిధి బృంధంతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక V సుభాష్నగర్ కాలనీ శివారు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పలువురు ప్రజలు వచ్చి సమస్యలను ఎకరవు పెట్టారు. వరదలు, వర్షాలు వచ్చి ఈ ప్రాంతం బురదమయంగా, రాత్రిపూట భయానకంగా మారుతోందని, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు ఎవ్వరూ గా పట్టించుకోవడం లేదని వా పోయారు. దీంతో స్పందించిన పాషా అక్కడి నుండే నేరుగా గ్రామపంచాయితీ ఇఓ శ్రీనివాసరావుకు ఫోన్ చేసి డ్రైన్లు, రోడ్లు, విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయాలని చెప్పడంతో త్వరలో నివేదికలు తయారు చేసి పనులు ప్రారంభిస్తామని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి ముంపుకు గురయ్యే కాలనీలను మెరక ప్రాంతంలో అత్యుధునిక జం హంగులతో నిర్మిస్తామని చెప్పారని, ఆ మాట వారు అధికారంలో ఉన్నంత కాలం నెరవేర్చలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శివారు ప్రాంతాల్లోనికి నీరు వస్తుందని, స్లూయూస్ల లీకుల వల్ల నీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మీ ప్రభుత్వానికి కోరారు. ముంపు కాలనీల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కార మార్గాలు చూపాలన్నారు. బూర్గంపాడు, అశ్వాపురంతో పాటు దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో వరదలు, వర్షాల వల్ల పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతాంగాన్ని, ఇళ్లు దెబ్బతిన్న పేద 1. ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు గండి పడిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం దానిని సరైన పద్ధతిలో నిర్వహణ చేయక పోవడంతోనే ఈ దుస్ధితి ఎదురైంది. వారి తప్పిదం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మత్తులు చేయించి తిరిగి ఉపయోగం లోనికి మీ తేవాలని పాషా కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, ముత్యాల విశ్వనాధం, జిల్లా సమితి సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు, పేరాల శ్రీనివాస్, నలజాల సత్యనారాయణ, ఎస్ సుబ్బారెడ్డి, పట్టణ నాయకులు మారెడ్డి శివాజీ, సాధనపల్లి సతీష్, గా చిట్టిపోతుల కృష్ణయ్య, పితాని మనస్సే, కొక్కిరేణి అశోక్, శ్రీను, మహేష్, శంకర్,

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 18

Read More »

 Don't Miss this News !