◆(CPI)ML మాస్ లైన్ ప్రజాపంధ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ
◆కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను సాధిద్దాం.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాయల చంద్రశేఖర్ మరణం పార్టీకి తీరని లోటు.
చర్ల నేటి గదర్ ప్రతినిధి,వరప్రసాద్ :
చర్ల మండల పరిధిలోని మొగళ్లపల్లి గ్రామంలో మంగళవారం మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంతాప సభని జరపాలని. పార్టీ పిలుపులో బాగంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ చర్ల మండల నాయకత్వం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని అనంతరం ఆయన ఆత్మ శాంతికై మూడు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగిందని తెలిపారు. అతని ఐదు దశాబ్దాల విప్లవ జీవితం ఆటుపోట్ల మధ్య వైరుధ్యాల మధ్య రాటు తేలిన వ్యక్తే కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అని అన్నారు. ఎన్నో నిర్బంధాలను బెదిరింపులను ధిక్కరించి ఉద్యమ జెండాను చివరిదాకా విడవకుండా మోసిన విప్లవ నాయకుడు రాయల చంద్రశేఖర్ అని అన్నారు.ఆయన మరణం పార్టీకి తీరని లోటని గతంలో వేల ఎకరాల పోడు భూములను గిరిజనులకు గిరిజనేతరులకు పంచిపెట్టిన చరిత్ర అతనికి ఉందని అన్నారు.పొడు పట్టాల కోసం రైతు గిట్టుబాటు ధర కోసం అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి అని పేదోళ్ల రాజ్యం సాధించేదానికోసం తుది శ్వాస విడిచే వరకు పోరాటం చేసిన వ్యక్తి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అని ఆయన అన్నారు. మీ ఆశయాలను వృధా పోనీయమని మీ ఆశయాల సాధనకై నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఈనెల 28న జరిగే కా,,రాయల చంద్రశేఖర్ సంతాప సభను ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరిగిందని అట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సానుభూతిపరులకు ఆయా పక్షాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు చిన్నo మోహన్, మెహముద, గ్రామస్తులు, పున్నారావ్, వరలక్ష్మి, నాగలక్ష్మి, ముత్యాలు, ధనలక్ష్మి ,సత్యవతి , అరుణ, సమ్మక్క, మౌనిక, తదితరులు పాల్గొన్నారు