నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం జులై 23:
అశ్వాపురం మండలంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు గోదావరి వరద పెరుగుతున్న సందర్బంగా ముంపు ప్రాంతాలైన అమ్మగారిపల్లి,నెల్లిపాక గ్రామాలలో పర్యటించి ఆ గ్రామ ప్రజలతో ఎంపీపీ ముత్తినేని సుజాత వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,వరద పెరిగే అవకాశం ఉంటే అధికారులు చెప్పిన వెంటనే అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్,ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు కమటం నరేష్,ఎంపీటీసీ గాదె జయ, అమ్మగారిపల్లి మాజీ ఉపసర్పంచ్ నేలపట్ల సుధాకర్ రెడ్డి,మండల కాంగ్రెస్ నాయకులు ఎస్కె అఫ్జల్,బిక్కసానీ సత్యనారాయణ,వలబోజు మురళీకృష్ణ,పర్వత నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 161