నేటి గద్దర్ ప్రతినిధి వరప్రసాద్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డెరైక్టర్
డాక్టర్ అమర్ సింగ్ సందర్శించారు చర్ల ఏజెన్సీలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు గ్రామాల లో పారిశుధ్యం, త్రాగు నీటి సరఫరా,జ్వరాలు, ఆసుపత్రి లో తగిన మందులు తనిఖీ చేశారు.అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు , కాన్పు సమయం దగ్గర్లో వున్న గర్భిణీ స్త్రీలను,భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు,గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ దివ్య నయన ను ఆదేశించారు.వీరి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్,జిల్లా ప్రోగ్రాం అధికారులు,డాక్టర్ బాలాజీ నాయక్,డాక్టర్ చైతన్య, డాక్టర్ స్పందన, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 144