రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 23:- మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ పరిదిలోని ఉమ్మడి రామాయంపేట,
నిజాంపేట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను సంబందిత ఎస్ఐ లు ఎస్పీకి వివరించారు.ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి కి రామాయంపేట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం ఎస్పీ అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.అదేవిధంగా జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు,సిసి కెమెరాలు, సిబ్బంది పని తీరును పరిశీలించడంతో పాటు పెండింగ్లో తీవ్రమైన నేరాల సి.డి ఫైల్స్, స్థిరాస్థి చోరీలు, ఐటీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు.అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో కల నేర ప్రవృత్తి కల వారిని ప్రతి రోజు తనిఖీ చేయాలని,అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలని కష్టంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని,అలాగే బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి స్టేషన్ అధికారులు, పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి రామాయంపేట సిఐ.వెంకట రాజా గౌడ్,ఎస్సై రంజిత్ కుమార్ నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సంబందిత పోలీస్ స్టేషన్ ల ఎస్ఐలు పోలీసు సింబ్బంది పాల్గొన్నారు.