ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గాలికి వదిలేశారు..
రెండు రాష్ట్రాల బడ్జెట్ లా ఉంది..
నేటి గదర్ న్యూస్ , జులై 23 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
నేడు పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలాగే ఉందనిపిస్తుంది అని కూసుమంచి మండల ఎంపీపీ భానొత్ శ్రీనివాస్ నాయక్ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి కుమార్ అన్నారు.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు , కూటమిలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఒకలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు యూపీఏ కూటమి రాష్ట్రాలకు మరోలా బడ్జెట్ కేటాయింపులు ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు అన్నారు.. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది..అన్ని సీట్లు గెలిచిన కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నేటి బడ్జెట్ లో మొండి చెయ్యి చూపిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు లో పొందుపరిచిన తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు , భయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాలను కనీసం ప్రస్తావనకు రాకపోవటం పక్షపాత ధోరణి కనపడుతుంది అన్నారు.. కేవలం ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన బడ్జెట్ లా ఉందని అన్నారు.. నిజంగా తెలంగాణ బీజేపీ మంత్రులకు తెలంగాణ పట్ల చిత్త శుద్ధి ఉంటే కేంద్రాన్ని నిలతీసి రాష్ట్రానికి న్యాయం చేసేలా చేయాలని ,లేకపోతే ఇద్దరు తెలంగాణ కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవికి రాజీనామా చేసి, ఓట్లు వేసి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు క్షమాపణ తెలుపాలని అన్నారు.. తెలంగాణ రాష్ట్రానికి నిజంగా న్యాయం చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ తో మాత్రమే సాధ్యం అవుతుంది అని తెలిపారు.. ఇప్పటికైనా తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం అని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు… కేంద్రంలో తమ అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ బడ్జెట్ తో తెలిసిపోయినదని ఏదేవ చేశారు… తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు…