◆పలు సమస్యలతో కూడుకున్న వినతిపత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందజేత
నేటి గదర్ కరకగూడెం:ఏజన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గౌడ కులస్తులుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై ఏజన్సీ మండలాలు అయిన కరకగూడెం,పినపాక, మణుగూరు గౌడ సంఘ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి పలు సమస్యలతో కూడుకున్న వినతిపత్రం అందజేసినారు.ఈ సందర్భంగా కరకగూడెం మండల గౌడ సంఘం నాయకులు మాజీ ఉప సర్పంచ్ రావుల.రవి గౌడ్ మాట్లాడుతూ ఏజన్సీ మండలాలలో ఎన్నో సంవత్సరాల నుండి స్థిర నివాసం ఉంటున్న గౌడల సమస్యలను 1950-1956 సంవత్సరంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342, 5వ షెడ్యూల్ సవరించిన చట్టం ప్రకారం 108/1977 జీవో నెంబర్ 58వ సీరియల్ నెంబర్ 7 ప్రకారం ప్రస్తుత జీవో 5 ప్రకారం ఏజెన్సీలో గౌడులు షెడ్యూల్ తెగలగా రాష్ట్రపతి సంతకం పొందపరచనైనది అన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిస్తున్న మాకు ఏటువంటి అవకాశాలు లేవని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గౌడ కులస్తులను అన్ని విధాలుగా అదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం,పినపాక గౌడ సంఘం నాయకులు లీలా వాసు,చీకటి. రామ చంద్రయ్య,కొంపెల్లి.నాగేశ్వరరావు, మల్లెష్,చిర్ర.కుమార్,జలగం.కనకయ్య,శ్రీను పాల్గొన్నారు.