రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 24:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపనయ్య తండాలో ఒక వ్యక్తి విద్యుత్ షాక్ గురై యువ రైతు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది.బాపనయ్య తండాకు చెందిన కట్రోత్ లక్ష్మణ్ (43) తన వ్యవసాయ పొలం వద్దకు మంగళవారం ఉదయం వెళ్లి పొలం గట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు బోరు మోటర్ వద్ద విద్యుత్తు వైర్లు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు విచారణ చేపట్టారు.
Post Views: 19