– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్
–
ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు లో గల రెండు వైన్ షాపులతో ప్రజలు పడుతున్న ఇక్కట్లపై పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ ఎక్సైజ్ సూపర్డెంట్ కు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఖమ్మం-సూర్యాపేట రాష్ట్రీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా రెండు వైన్ షాపులు నిర్వహిస్తూ అనధికారికంగా సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులు
రాత్రిపూట మహిళలు ఆటో దిగి ఇంటికి వెళుతుండగా అల్లరి పెడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఉదయం బడికి ,కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఇటువంటి అనుభవాలే ఎదురైతున్నాయి అన్నారు. రహదారి పక్కనే వైన్ షాపులు ఉండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. ప్రధానంగా మందుబాబులు వాహనాలు రోడ్డు సగభాగంలో పెడుతుండడంతో సమస్య మరింత తీవ్రతరంగా ఉందన్నారు. ఈ పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.వారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కొక్కు.రాజు,శేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు









