+91 95819 05907

గోదా”వర్రి”:3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

– భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
– 53 అడుగులు దాటడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ
– తీవ్ర రూపం దాల్చుతున్న వరద ఉధృతి
– ఇతర రాష్ట్రాలకు రాకపోకలు బంద్
– పునరావాస కేంద్రాలుకు తరలి వెళ్లాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్ IAS

నేటి గదర్, జూలై 22,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలను ముంపుకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా గత రెండు వారాలుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి ఇప్పటికే రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ప్రవహించింది. మొదటిసారి అధిక నీటిమట్టం 50.6 అడుగుల మేరకు చేరుకోగా అక్కడి నుంచి నిదానంగా నీటిమట్టం తగ్గుతూ గోదావరి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే గోదావరి శాంతిస్తుందని ఊపిరి పీల్చుకునే లోపే ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గోదావరిలో కలుస్తున్న వరద నీటి ప్రభావంతో గోదావరి నీటిమట్టం మళ్లీ అంతకంతకు పెరుగుతూ ప్రస్తుతం 53 అడుగులు దాటి ప్రవహిస్తుంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నాటి నుండే అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరుకునే అవకాశాలు ఉండడంతో అధికారులు వరద ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ మేరకు నీట మునిగిన లంక గ్రామాలలోని ప్రజలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు తరలిస్తూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

– తీవ్ర రూపం దాల్చుతున్న వరద ఉధృతి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుతుంది. ఈ మేరకు గోదావరి వరదలను ప్రభావితం చేసే ప్రాజెక్టులు నీటిమట్టం గరిష్ట సాయి చేరుకోవడంతో సంబంధిత అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి గంటకు పెరుగుతూ తీవ్ర రూపం దాల్చుతుంది. లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు భారీగా చేరుకోవడంతోపాటు మరింత వ్యాప్తి చెందుతూనే ఉంది. దీంతో గోదావరిలో కలిసే వాగులు, వంకలు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల వాటి పరిసర ప్రాంతాల్లో సైతం వరద వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ఈ మేరకు బ్యాక్ వాటర్ ను నదిలోకి పంపేందుకు అధికార యంత్రం అధిక సామర్థ్ గల
మోటార్లను వినియోగిస్తూ బ్యాక్ వాటర్ ను గోదావరి లోకి పంప్ చేస్తున్నారు.

– ఇతర రాష్ట్రాలకు రాకపోకలు బంద్

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది నదిలో వరద ఉధృతి పెరగడంతో గోదావరికి అనుసంధానమై ఉన్న వాగులు వంకల్లో బ్యాక్ వాటర్ ఉప్పొంగి వరద నీరు రోడ్లపై చేరుతుంది. ఈ మేరకు రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఈ నేపద్యంలో ఇతర రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం డివిజన్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై కి వరదనీయ చేరుకోవడంతో చతిస్గడ్, ఆంధ్ర రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఇప్పటికే భద్రాచలం నుండి కూనవరం వెళ్లే మార్గం పైకి వరద నీరు చేరుకోవడంతో ఆ మార్గం గుండ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నందిగామ, మురుమూరు ప్రధాన రహదారిపై గోదారి ప్రవహిస్తుండడంతో అక్కడ సైతం రాకపోకలు సాగించే అవకాశం లేకపోయింది. కాదా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక నుండి రెడ్డిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై కి వరద నీరు చేరుకున్నాయి. అదేవిధంగా బూర్గంపాడు నుండి సోంపల్లి గ్రామానికి సైతం వెళ్లే అవకాశం లేకుండా రోడ్లపైకి గోదావరి వరద నీరు వచ్చి చేరింది. ఇదేవిధంగా దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని పలు లంక గ్రామాలకు వరద ముప్పు గంట గంటకు పెరుగుతూనే ఉంది.

– పునరావాస కేంద్రాలుకు తరలి వెళ్లాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్ IAS
భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయానికి 53 అడుగుల వరకు నీటిమట్టం చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సైతం అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు గోదావరి వరదలు ప్రభావిత ప్రాంతాలలోని సమస్యలపై అప్రమత్తంగా ఉన్నారని ప్రజలను ఆందోళనకు గురి చేసే వదంతులను, అసత్యాలను ఎవరు ప్రచారాలు చేయొద్దని ఆయన హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !