+91 95819 05907

అక్రమ రవాణా దారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:సీఐ సురేష్

నేటి గదర్ న్యూస్ కారేపల్లి/టేకులపల్లి:

అక్రమ రవాణా చేసే వారి పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఐ సురేష్ పిలుపునిచ్చారు .
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ( ఏ ఐ డి) సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ క్రమ రవాణా అనేది నానాటికి వివిధ రూపాల్లో మారుమూల గ్రామస్థాయిలో కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా మహిళలు బాలికలను ప్రధాన లక్ష్యంగా చేసుకొని వివిధ రూపాల్లో అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు
సామాజిక మాధ్యమాలలో అనగా ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ చాట్ రూమ్స్ తదితరాలలో మన వ్యక్తిగత వివరాలను పొందుపరచవద్దని అలా చేసినట్లయితే అక్రమ రవాణా దారులకు మనము ఒక అవకాశం ఇచ్చినట్లేనని తెలిపారు.
హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు సత్ప్రవర్తనతో మెలిగి మంచి నడవడిక తోటి ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి జీవితంలో స్థిరపడాలని బోధించారు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వేలు కుదిరినప్పుడల్లా ఆరుబయట మైదానంలో ఆడుకుంటూ మానసిక ప్రశాంతతను పొందాలని తెలిపారు సెల్ఫోన్ విరివిరిగా ఉపయోగించడం వల్ల అనేక రకమైన మానసిక శారీరక రుగ్మతలకు లోనవాల్సి వస్తుందని చిన్న వయసులోనే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటే జీవితం అంధకారం అవుతుందని తెలిపారు
యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ సోషల్ మొబలైజర్ కుటుంబరావు మాట్లాడుతూ అక్రమ రవాణా విస్తరిస్తుందని అక్రమ రవాణా దారులు ఏ రూపంలోనైనా మనమీద దాడి చేయవచ్చు అని తెలిపారు అక్రమ రవాణా చేయడం ద్వారా ఆడపిల్లలను మహిళలను వ్యభిచార వృత్తి లోకి బలవంతంగా నెట్టబడుతున్నారని బాల్య వివాహాలు కూడా అక్రమ రవాణాకు ఒక కారణమని తెలిపారు బాల్య వివాహ నిరూమోలను చట్టాన్ని సమగ్రంగా అమలుపరచినప్పుడే ఆడపిల్లలు చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తారని వారిని ప్రోత్సహించాలని తెలిపారు అదేవిధంగా మానవ అక్రమ రవాణా లో మన శరీరాన్ని అవయవాలను కూడా వేరుచేసి అమ్ముతూ సామాన్య లేక జీవితాలతోటి ఆడుకుంటారని నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అనుమానం వస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో తెలియపరచాలి లేదా డైల్ 100 నెంబర్ కు లేదా 1098 కు ఫోన్ చేసి తెలపాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఏఐడీ సంస్థ బాధ్యులు కుటుంబరావు, మాన్ సింగ్ విద్యార్థిని విద్యార్థులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !