+91 95819 05907

ఆపదలో ఆపన్న హస్తం అందించే దే ‘డయల్ 100’ వ్యవస్థ

★జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి

సిల్వర్ రాజేష్ (నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా)

శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది ముందుండి డయల్‌ 100 కాల్స్‌ పై తక్షణమే స్పందించాలి
డయల్ 100 సర్వీసును సక్రమంగా నిర్వహించడం ద్వారా
ప్రజలకు భద్రత మరియు సత్వర సహాయం అందించవచ్చు.
ఇది అత్యవసర సమయంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
డయల్‌ 100 కాల్స్‌ పై ప్రత్యేక నిఘా
క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి.
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్
ఈ రోజు జిల్లా ఎస్.పి. డి.శ్రీ.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ…. జిల్లా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బందితో డయల్ 100 కాల్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించి వారికి డయల్ 100 కాల్స్ విదులను గురించి సిబ్బందికి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ….
పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి తీరు జనం మెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. అందులో ‘100’ నెంబర్తో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘100’ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ ‘డయల్-100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని ప్రతి ఫోన్ కాల్ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంది.
శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది ముందుండి డయల్‌ 100 కాల్స్‌ పై తక్షణమే స్పందించాలని సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితలకు న్యాయం చేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల ధన, మాన, ప్రాణ, రక్షణను కాపాడాల్సిన బాధ్యత పోలీస్‌ వ్యవస్థపై ఉందన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే బ్లూ కోట్స్‌ సిబ్బంది ఆపద సమయంలో ముందుండాలన్నారు. సమాజంలో వేగంగా పెరుగుతున్న జనాభాలో సాంకేతికంగా మార్పులు చెందుతున్నాయని ఈ తరహాలో నేరాలు బాగా పెరుగుతున్నాయన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీస్‌ వ్యవస్థలో కూడా మార్పులు రావాలని కోరారు. డయల్‌ 100 కాల్స్‌ వచ్చినప్పుడు బ్లూ కోట్స్‌ సిబ్బంది అత్యవసర పరిస్థితిలో ఉన్నా సంబంధిత ప్రదేశాలకు వెళ్లి బాధితులకు సహాయం చేయాలన్నారు. సమస్య పెద్దదిగా ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు Dail 100 service చాలా పటిష్టంగా మరియు ప్రతిష్టాత్మకంగా ప్రజలు వినియోగించుకుంటున్నారని ప్రజలకు ఎటువంటి విపత్కర పరిస్థితిలో అయిన పోలీసు వారి సహాయం కావలసినపుడు ప్రజలు 100 కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని వెనువెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది వెళ్ళి అట్టి వారిని విచారించి వారి ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని జిల్లాలో దీని కోసం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఈ 100 కాల్స్ నీ మానిటరింగ్ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోని ఎస్.హెచ్.ఓ ఆ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి కాల్స్ లను క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఫోన్ చేసి అక్కడికి వెనువెంటనే బ్లూ కొల్ట్ లేదా పెట్రోల్ కార్ టీమ్ ను పంపించి వారి యొక్క ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేయడం జరుగుతుంది.
కానీ కొంతమంది రాత్రి పూట మత్తు పానీయాలు సేవించి డయల్ 100 కాల్ చేయడం జరుగుతుంది. అట్టి వారిని పోలీస్ స్టేషన్ కి ఉదయం పూట పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్ని పోలీసు స్టేషన్ SHO లకు సూచించారు. ఇట్లా కొంతమంది చేయటం వలన Dail 100 సర్వీస్ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆపదలో ఉన్న వారికి సరియైన సేవలు అందవని అలాంటి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎస్పి SHO లకి సూచించారు. అలాగే ఆకతాయిలు, తాగుబోతులు అనవసరంగా ‘డయల్ 100’ కాల్స్ చేస్తే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని అన్నారు. 100 డైల్ కాల్ నీ అత్యవసర పరిస్థితిలో మరియు విపత్కర పరిస్థితి లో పోలీసు వారి సహాయం కావాలనుకునేటప్పుడు తప్పని సరిగా వినియోగించుకోవాలన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !