★సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్
జూలూరుపాడు, జూలై 28, నేటి గద్దర్ : మండల పరిధిలోని కరివారి గూడెం గ్రామ శివారు పెద్దవాగులో వ్యక్తి గల్లంతయిన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమావత్ వెంకటేశ్వర్లు వయస్సు సుమారు (65) అనే వ్యక్తి పశువులు మేపుటకు వెళ్లి వాగు దాటుతూ గల్లంతయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్, స్థానిక ఎస్సై రానా ప్రతాప్ లు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలని ముమ్మరం చేశారు. గ్రామస్తులు ఆ ప్రాంతంలో సుమారు నాలుగైదు గంటలు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటికి తీశారు. గల్లంతయిన వ్యక్తికి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Post Views: 731