+91 95819 05907

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ కన్జర్వేషన్ డే

◆సమాజ సహజ సంపదను పరిరక్షించాలి…

◆టీచర్లు,విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించాలి…సీఐ సతీష్ కుమార్

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 28:
నైనారపు నాగేశ్వరరావు✍️

మణుగూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ కన్జర్వేషన్ డేను నిర్వహించారు.ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ సెక్రెటరీ షేక్ మీరా హుస్సేన్,ప్రెసిడెంట్ నల్లగట్ల సత్య ప్రకాష్ మాట్లాడుతూ,ప్రకృతిలోని వనరులను,వృక్ష జంతు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని అన్నారు.సహజ వనరులను వృధా చేయరాదని,పొదుపుగా వాడుకోవాలని అన్నారు.భవిష్యత్తు తరాల అవసరాల రీత్యా సహజ వనరులలో వృధాను తగ్గించాలన్నారు.వనరుల వినియోగం నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.సమాజ సహజ సంపదను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. లైన్స్ క్లబ్ మణుగూరు ఆధ్వర్యంలో సమాజ హితం కోసం ఎన్నో సామాజిక సేవా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

“టీచర్లు,విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించాలి”…సీఐ సతీష్ కుమార్

టీచర్లు,విద్యార్థులలో మానవీయ విలువలు, సమాజంలో ఇతరుల పట్ల ఎలా మెలగాలి వంటి సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించాలని మణుగూరు సిఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు.లైన్స్ క్లబ్ మణుగూరు రెండు రోజుల టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రాం క్వెస్ట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.విద్యార్థులలో సామాజిక అంశాలపై అవగాహన పెంచుటకు,విద్యార్థుల జీవన నైపుణ్యాలపై టీచర్లకు శిక్షణను ఏర్పాటు చేసిన లైన్స్ క్లబ్ మణుగూరు సభ్యులను అభినందించారు. మణుగూరు లైన్స్ క్లబ్ సమాజసేవతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.టీచర్లు సమాజ నిర్మాతలని, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉందన్నారు.అనంతరం 30 మంది టీచర్లకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మరియు ప్రతిభ చూపినటువంటి టీచర్లకు ప్రత్యేక బహుమతులు మరియు టీచర్లకు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ పిళ్ళారిశెట్టి హరిబాబు లైన్స్ క్లబ్ ఇమీడియట్ పాస్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,సభ్యులు గాజుల రమేష్,కముజు చంద్రమోహన్, బేతంచెర్ల వెంకటేశ్వర్లు,చింతపల్లి రాంబాబు, ముత్తంశెట్టి నాగేశ్వరరావు, అడబాల నాగేశ్వరరావు,భూక్య ప్రసాదు,భూక్యతార, జాగిరపు చంద్రశేఖర్,ఆదిత్య,కొండపల్లి రేణుక మరియు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల 30 మంది టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !