-చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్
నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో (జూలై 29);
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బైరు రమాదేవి రాములు గౌడ్ గ్రామ ప్రజలు సీజన్ వ్యాధుల పట్ల జాగర్తల తీసుకోవాలంటూ.. మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడేటప్పుడు కరెంట్ స్తంభాలు ముట్టుకోవద్దని, ఇండ్లలో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వర్షం పడేటప్పుడు బయటికి వెళ్లకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, అదేవిధంగా కాలనీలోని ఇండ్ల చుట్టూ వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడబడితే అక్కడ కరాబైన టైర్లు, ట్యూబుల పడేయడం వల్ల అందులో పాములు, తేళ్లు, కీటకాలు జొరబడి ప్రాణాపాయం జరగవచ్చని, అలాగే వాటిలో వాన నీరు చేరి దోమల పిల్లలు పెరిగి మలేరియా డైరియా కలరా డెంగు ఇలా రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఇలా గ్రామ ప్రజలకు సూచనలు చేస్తూ.. బైరు రాములు గౌడ్ రమాదేవి ప్రజలను జాగ్రత్తగా పాటించాలని కోవడం జరిగింది.