రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 9:- మద్యానికి బానిసై డబ్బుల కోసం కన్నతల్లిని హత్య చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల మండల కేంద్రానికి చెందిన చల్మేటి దుర్గవ్వ (75) అర్ధరాత్రి కొడుకు రామచంద్రం మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలని కన్నతల్లిని హత్య చేయడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట సిఐ.వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా సిఐ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేశాడని మృతురాలి కుమార్తె పెద్ద మల్లారెడ్డి కి చెందిన నాగుల విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవ పంచనామ నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతురాలి శవాన్ని తరలించామని తెలిపారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే దుర్గవ్వ మరణంతో విషాద ఛాయలు అలముకున్నాయి.