★ఘనంగా సన్మానించిన ఎమ్ఎమ్ఏ సెక్యూరిటీ గార్డ్స్
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు ఆగస్టు 9:
మణుగూరు సింగరేణి ఏరియాలో ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని మణుగూరు మురళి మాన్ పవర్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్స్ అన్నారు.శుక్రవారం S&PC లో పని చేసే
సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ వెంకటేశ్వర్లు (జమేదార్)జె రామ కోటేశ్వరరావు,ఏ రూప లు పదవి విరమణలో భాగంగా ఎమ్ఎమ్ఏ
సెక్యూరిటీ గార్డ్స్ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా ఎమ్ఎమ్ఏ సెక్యూరిటీ గార్డ్స్ మాట్లాడుతూ, పదవి విరమణ తరువాత వారి శేషు జీవితం నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలతో కొనసాగాలని అకాంక్షించారు.గత కొన్ని ఏండ్లుగా S&PCలో సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేసి సింగరేణికి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారని కొనియాడారు.సింగరేణికి అందించిన వారి సేవలు మరువలేనివన్నారు.సింగరేణికి
అంకితభావంతో పని చేసి అందరి అధికారుల మన్నలను పొందారన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామావతార్ సుధాకర్,రబ్బాని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వి శ్రీనివాసరావు, జై.నరసింహ,జి.శ్రీను,పి సుధీర్,సంజీవరెడ్డి, ఎన్.శ్రీనివాస్,ఎం.సతీష్ బాబు,రంగారెడ్డి, సత్యనారాయణ,నయూమ్ పాషా,డి.ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.