సిల్వర్ రాజేష్ నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా
ఆగస్ట్ -09-2024.
స్వచ్చదనం-పచ్చదనం లో ప్రతిఒక్కరు పాల్గోనాలి
అధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి.
మెదక్ పట్టణంలోని 12వ వార్డు మాధవీనగర్ కాలనీలో గురువారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా హాజరై చెట్లను నాటారు. అనంతరం మున్సిపల్ శాఖ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు వివిధ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం అని ఆయన పేర్కోన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గోనాలని ఆయన తెలిపారు. అదే విధంగా అధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజలు ఏ పని పై వచ్చిన వారికి జవాబుదారీగా వ్యవహరించడమే కాకుండా వారి పని పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో అడీషనల్ కలెక్టర్ (రెవిన్యూ) వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, బొజ్జ పవన్, కౌన్సిలర్ లు దాయర లింగం,దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, మేడి మధుసూదన్, దుర్గప్రసాద్, నిఖిల్, సమీ, బాని, రాగి అశోక్, బొద్దుల క్రిష్ణ, అంజద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ మున్సిపల్ కమీషనర్
జానకీరాం సాగర్,మున్సిపల్ సిబ్బంది ఆర్.పి.లు తదితరులు పాల్గోన్నారు.