నేటి గదర్ న్యూస్, మెదక్ ప్రతినిధి:
✍️సిల్వర్ రాజేష్
ఆ దేవాలయంలో వరుస దొంగ తనాలు…ఏకంగా రెండు హుండీలను బయటకు తీసుక వెళ్లి సొత్తు చోరీ చేసిన దొంగలు… ప్రత్యక్ష సాక్షులు, ఆలయ పూజారులు తెలుపినవివరాలు ఇలా ఉన్నాయి..మెదక్ జిల్లా పాపన్న పెట్ మండలం నాగ్ సన్ గ్రామంలో శ్రీ ఏడుపాయ ల వన దుర్గ భవాని ఆలయం కలదు.ఈ నేపథ్యంలో భక్తుల విరాళాల కోసం
గర్భగుడి ముందు రెండు హుండీలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. వాటిపై దొంగల కన్ను పడింది. శనివారం ఉదయం దొంగలు ఆ రెండు హుండీల చోరీకి పాల్పడ్డట్టు ఆలయ పూజారులు , ఎండోన్మెంట్ అధికారులు గుర్తించారు. చోరీ చేసిన రెండు హుండీలను దొంగలుపాత కళ్యాణ కట్ట వద్దకు తీసుకువెళ్లి వాటిని పగలకొట్టి సొత్తును చోరీ చేశారు. హుండీలు కావడంతో ఎంత మొత్తంలో చోరీకి గురయిందో తెలియ రాలేదు.
గతంలో కూడా గర్భగుడి లో దొంగల్ హల్చల్ చేశారు. ఆలయ పాలకమండలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా
గత 10 రోజుల కింద ఏడుపాయల హుండీ లెక్కించిన ఆలయ ఎండోమెంట్ అధికారులు. ఏడుపాయల గుడిలో వరస దొంగతనాల పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దొంగల ఆట కట్టించాలని వేడుకుంటున్నారు.