◆కస్తూర్బా విద్యార్థినికి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చేయూత
◆అంతర్జాతీయ పోటీలలో నేపాల్ వెళ్లేందుకు 30,000/- అందజేత_
ముదిగొండ మండలం, ఆగస్ట్ 10:
ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చల్లగొండ అభినయ శ్రీ అనే విద్యార్ధిని కరాటే జాతీయ పోటీలకు ఎంపిక అయ్యి నేపాల్ వెళ్ళాల్సి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో విద్యార్ధిని తల్లీ తండ్రులు ఈ విషయాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులకు తెలపడంతో వెంటనే స్పందించిన యువత సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ ల ద్వారా మొత్తం వచ్చిన 30,000/- రూపాయలను అందజేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థినిని శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బండారు ఇందిరా మాట్లాడుతూ విద్యార్థినులకు ఎంత గానో కోచ్ ఇస్తూ అంతర్జాతీయ పోటీల వరకు తీసుకువెళ్ళిన పీఈటి నిర్మల మేడంని అభినందించి అలాగే సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టు ను చూసి సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో న్యూ లక్ష్మీపురం కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటూ ఆర్థిక ఇబ్బందులతో ఉండే విద్యార్థినులకు అన్ని రకాలుగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.