+91 95819 05907

ర్యాగింగ్ అనేది అత్యంత అమానుష చర్య:SP

◆సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ స్నేహితులుగా పెద్దన్న పాత్ర పోషించాలి
◆ర్యాగింగ్ అనేది అత్యంత అమానుష చర్య

సిల్వర్ రాజేష్ నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా.

ఆగస్ట్ –10-2024

*ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దు.*
*ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం ర్యాగింగ్ నియంత్రణకు జిల్లా స్కూల్/ కళాశాల యాజమాన్యం బాగస్వాములు కావాలి* *ర్యాగింగ్ నిరోధించడానికి ప్రతి కళాశాలలో జిల్లా పోలీస్ అధికారులచే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తాం*
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.
జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ మాట్లాడుత స్కూల్ ల్లు/కళాశాలలలో ర్యాగింగ్ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పాఠశాలలో మరియు కళాశాలలో Anti – Ragging కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రతి కళాశాలలో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించేలా ఏర్పాట్లను చేపట్టాలని తెలియజేశారు.
ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందవచ్చు అన్నారు. అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులు నిర్వహించాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను సిబ్బందిని ఆదేశించడం జరిగినదని తెలిపినారు. యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలని తెలిపినారు. ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు, పిల్లలు తల్లిదండ్రులు మంచి పేరుప్రతిష్టలను తేవాలి అని కోరారు.
విద్యార్థులు తమ భవిష్యత్‌ను నిర్మించడంలో కళాశాల క్యాపంస్‌ కీలక పాత్ర పోషిస్తుందని అలాంటి విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కళాశాల విద్యార్థుల మద్య స్నేహపూరిత వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. సీనియర్లు జూనియర్లు అని కాకుండా సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ స్నేహితులుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ జూనియర్లకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. ర్యాగింగ్ అనేది అత్యంత అమానుష చర్యని తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్ష్యం కాదని ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుక్కుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారు ఇలాంటి చర్యలకు పాల్పడి విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. సరదాలకు వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకోవద్దని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అలాగే కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన విద్యార్థులను సంప్రదిస్తూ వారిలో ర్యాగింగ్ మహమ్మారిని వ్యతిరేకించే విధంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించాలి. ఎవరైనా కళాశాలల్లో ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్లుగగాని ర్యాగింగ్ గురివుతున్నట్లుగా విద్యార్థులకు అనిపిస్తే మౌనంగా ఉండకుండా తక్షణమే డయల్ 100 కి కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712657888 సమాచారం అందించాలని ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే పోలీసులను ఎలా ఆశ్రయించాలి ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి అనే దానిపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ ద్వారా అవగాహనా కార్యక్రమాలు చేపడతామని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు సైతం ప్రతి కళాశాలలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని గోడ ప్రతుల ద్వారా ర్యాగింగ్ పాల్పడితే కలుగు నష్టాలను తెలియపరుస్తామని ఎస్పీ తెలియజేశారు.
ఎస్పీ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ :- ఎవరైనా ఆకతాయిలు పాఠశాలలో మరియు కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడితే Anti – Ragging చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తద్వారా వారి జీవితం అంధకారమయం అవుతుందని ఇతర ఏ కాలేజీలో కూడా వారికి అడ్మిషన్ లభించదని ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లి తండ్రి గమనించి వారి పిల్లలకు తగు మార్గదర్శకాలను తెలియపరచాలని ఎస్పీకోరారు.ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే వెంటనే పోలీసువారికి డయల్ 100 కి లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712657888 అను నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !