పది…పది…. ఇరవై …ఇరవై… బుడగలు… గుడుంబా బుడుగ లు
★ గ్రామాల్లో జోరుగా గుడుంబా
★ రేటు తక్కువ.. కిక్కు ఎక్కువ
★ గ్రామాలకి వచ్చి గుడుంబా వేస్తున్నది ఎవరు?
★ ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలవదా? అంటున్న మహిళా లోకం
★ మత్తులో జోగుతున్న యువత,ముందు బాబులు
★ అనారోగ్యం పాలవుతున్న గుడుంబా రాయుళ్లు
★ గుడుంబా తాగి చిన్న వయసులోనే యమపురికి పయనం
★ ఎక్సైజ్ శాఖకు పట్టింపేది
నేటి గదర్ న్యూస్,పినపాక: 10… 10… 20… 20.. ఇది సంతలో, పట్టణాలలో వస్తువుల విక్రయాలు జరుపుతున్నప్పుడు వీధి వ్యాపారులు కేకలు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. కానీ గుడుంబా మాఫియా బరితెగించి పొట్లాలు కట్టి రూ. 10,రూ 20 యదేచ్చగా గుడుంబా విక్రయాలు జరుపుతున్నారు. ధర తక్కువ కిక్కు ఎక్కువ. దీనితో మందుబాబులు గుడుంబా లో మునిగి తేలుతున్నారు. గుడుంబా మహమ్మారిపై నేటి గధర్ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అనేక గ్రామాలలో గుడుంబా యదేచ్చగా విక్రయాలు జరుగుతున్నాయి. ఏడుళ్ళ బయ్యారం,పోట్లపల్లి, సీతంపేట, పినపాక గోపాలరావుపేట ,బోటిగూడెం, జానంపేట, దుగ్గినపల్లి, పాండురంగాపురం తదితర గ్రామాలలో గుడుంబా అమ్మకం దారులు గుడుంబా కొనుగోలు చేసి ఎలాంటి జంకు లేకుండానే పొద్దు, పగలు, రాత్రి తేడా లేకుండా విక్రయాలు జరుపుతున్నారు. వాటిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి బుడగలు అని పేరు పెట్టి రూ. 10 రూ.20రూ. 30 రూ.40 రూ.50 చొప్పున మందుబాబులకు విక్రయిస్తున్నారు. వివిధ రసాయనాలతో కుటుంబాన్ని తయారు చేయడం మూలంగా మందుబాబులకి కిక్ బాగా ఎక్కుతుందని అది కూడా కేవలం రూ. 40,రూ.50 కి అని వారు బహిరంగంగానే చెప్తున్నారు.
★ గుడుంబా ఎక్కడి నుంచి వస్తుంది★
మండలంలోని అన్ని పల్లెల్లో పోలీసుల వారి హెచ్చరికలతో గత పది సంవత్సరాల నుంచి సారాయి కాచే బట్టీలు మూతపడ్డాయి. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ గ్రామాలకు గుడుంబా ఎవరి సప్లై చేస్తున్నారు? వారిని పట్టుకోవడంలో ఎక్సైజ్ శాఖ ఎందుకు విఫలమవుతుంది అని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాయదారి గుడుంబా మూలంగా దాన్ని కిక్కు బానిసై చిన్నతనంలోనే యువత ప్రధాన అవయవాలు పాడైపోయి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. పిల్లలు అనాథలుగా మారడంతో పాటు, యువతులు చిన్నతనంలోనే విధవలుగా మారుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ మాత్రం నిర్లక్ష్యం వినడం లేదు. ఇప్పటికైనా గుడుంబా అక్రమ రవాణా చేసేవారిని గుర్తించి గ్రామాలలో గుడుంబాని నియంత్రించాలని మహిళా లోకం కోరుతుంది.