నేటి గదర్ , ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, ఆగస్టు, 10:
ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం, మరికాల గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్ధాలని జిల్లా ప్రభుత్వ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు నేతకాని సామాజిక కార్యకర్త జాడి ఈశ్వర్ నేతకాని ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాల పంచాయితీలైన బెస్తగూడెం, మరికాల పంచాయితీల గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, సరిగా వీధి రోడ్లు లేవని, ప్రతి విధికి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, ప్రతి విధిలో మంచి నీటి కొరత ఉందని, మంచి నీటి కొరత వల్ల పంచాయితీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, మిషన్ భగీరథ మంచినీటి పథకం వల్ల ప్రయోజనం లేదని, ఆ నీళ్ళు 20 లీటర్ల కన్నా ఎక్కువ గా రావడం లేదని, ఒక నలుగురు ఉన్న కుటుంబానికి నిత్య అవసరాల నిమిత్తం రోజుకు 300 ల నుండి 350 లీటర్ల నీటి స్ అవసరం ఉంటుందని, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి విధిలో మంచినీటి కొరత లేకుండా చూడాలని తెలిపారు. ఈ పంచాయతీల పరిధిలో అందరూ ఎస్సీ, ఎస్టి, బీసీ వర్గాలకు చెందిన పేద వర్గాల ప్రజలే ఉన్నారని, ప్రజలు ఉండడానికి సరైన ఇండ్లు లేవని, ఈసారి విడుదలయ్యే మొదటి విడత డబులు బెడ్ రూం ఇళ్ల పథకం లో ఈ రెండు పంచాయతీలకు కలిపి 600 ల ఇండ్లు కేటాయించాలని, ఈ పంచాయతీల అభివృద్ధికి , మోడల్ పంచాయతీలుగా తీర్చి దిద్దడానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.