*తరం కనుమరుగైతుంది* ….!
నేటి గద్దర్ న్యూస్
ములుగు జిల్లా
ఆగస్టు 10:
ఆ ప్రేమ… కనుమరుగైపోతున్నది….!!
తరం కనుమరుగైతుంది
ప్రేమ ఆప్యాయతలు కనుమరుగైపోతుంది.
బహుదూరపు బాటసారై
పయనం అవుతున్నది.
జ్ఞాపకాల మూట వదిలి
బాటపట్టి పోతుంది.
తెల్లని వస్త్రధారణతో…
స్వచ్ఛమైన మనసుతో…
మధురమైన ప్రేమతో…
అందరి పట్ల అనురాగంతో
భారం గల బతుకులతో
అందరినీ కలుపుగోలు
సాగించిన ….!
మన ముందు తరం కనుమరుగై పోతున్నది.
వయోభారంతో వరుసల దూరం
కనుమరుగైపోతుంది.
హుందాతనపు మీసకట్టు…!
రాజహాసపు పంచ కట్టు….!
పూటకో మార్చని మాట కట్టు….!
శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు….!
తల తెగిన తప్పని ఒట్టు….
ఇబ్బందులు ఎన్ని ఎదురైనా
విప్పని గుట్టు….
ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన….!
ఒక నాటి పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే….!
హృదయం బరువెక్కుతుంది .
మనసు మూగబోతుంది
కంటనీరు కారిపోతుంది.
ఆర్థిక ఇబ్బందులు….!
కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా…..!
సమస్యలు ఎన్నో ఎదురైనా…అందరూ సామరస్యంగా..కలిసిమెలిసి ….!
ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు….!
ఒకరికొకరు సహకరించుకునేవారు.
అందరి కోసం ఒకరు….!
ఒకరికోసం అందరూ….!
ఇలా ఇప్పుడు నా తరం
కనుమరుగవుతున్నది….!
బంధాలు దూరమవుతున్నది
గుండె భారంతో కుటుంబాలు
ఒకరికొకరు ఈమడలేక…!
ఏకాకీగా అవుతున్నారు…!
నా తరం కనుమరుగవుతున్నది
జన్ను రవి
మాజీ సర్పంచ్
మదనపల్లి, ములుగు జిల్లా