◆నూతనంగా ఏర్పడ్డ రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ పాడి గణపతి రెడ్డి
నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో (ఆగస్టు 10);
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలలోని జెకె కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 2500 మంది రైస్ మిల్లర్స్ తో ఏర్పాటు జరిగింది. అధ్యక్షునిగా పాడి గణపరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల సాధనలో తన వంతు కృషి చేస్తానంటూ బందు ప్రీతి పక్షపాతం లేకుండా తన వంతు సహకారం అందరికీ న్యాయం జరిగే విధంగా రాత్రి, పగలు అంతఃకరణ శుద్ధితో శ్రమించడానికి సైనికుడిగా అందర్నీ కలుపుకొని ఎంతటి జటిలమైన సమస్యలైనా సాధించడానికి కృషి చేస్తానని, ఈ సందర్భంగా వాగ్దానం చేశారు.
ఒకప్పుడు ఉప్పుడు బియ్యం అసోసియేషన్, రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఒకటేనని, ఎక్కువ రైస్ మిల్లులను కలిగి ఉన్నది రా రైస్ మిల్లర్లు లని, ఉప్పుడు బియ్యం మిల్లర్స్ పెత్తనాన్ని సహించలేనీ రా రైస్ మిల్లర్స్ నూతనంగా రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. గణపతి రెడ్డి
తనను నమ్మి మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ అసోసియేషన్ లో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా సమస్యల సాధనలో కృషి చేస్తానని మిల్లర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.