నేటి గదర్ న్యూస్ ఆగష్టు10: వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాసరావు.
వైరా :ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలం ను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,రాష్ట్ర గిడ్డంగల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మాణంలో ఉన్న సీతారాం ప్రాజెక్టు మూడు పంపు హౌస్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, అనంతరం వైరా సభలో మూడో విడవ రుణమాఫీ పై స్పష్టమైన ప్రకటన చేస్తారని స్పష్టం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,రుణమాఫీ సంబరాలు జరుగుతాయి అని అన్నారు,ఆగస్టు 15 రైతు దినోత్సవం జరుపుకోబోతున్నామని తెలిపారు,సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,రాష్ట్ర విత్తనాభి వృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి,నూతి సత్యనారాయణ,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు,బోర్రా రాజశేఖర్,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మోక్క శేఖర్ గౌడ్, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి,హరినాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.