+91 95819 05907

నేడే భారత అంతరీక్ష పితామహుడు విక్రమ్ సారభాయ్ జన్మదినం. స్పెషల్ స్టోరీ.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. విక్రమ్ సారాభాయ్ బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి ప్రావిన్సులోని (ప్రస్తుతం గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది) అహ్మదాబాద్‌లో 1919 ఆగస్టు 12న జన్మించారు . అంబాలాల్ సారాబాయ్, సరళాదేవి (పూర్వనామం రేవా) అతని తల్లిదండ్రులు. వారి ఎనిమిదిమంది సంతానంలో విక్రమ్ ఒకరు .

వారిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబం. విక్రమ్ తండ్రి అంబాలాల్ అహ్మదాబాద్‌లో పేరు పొందిన పారిశ్రామికవేత్త. అహ్మదాబాద్‌లో కాలికో మిల్లుతో ప్రారంభించిన అంబాలాల్‌కు బీహారులో పంచదార కర్మాగారం, తూర్పు బెంగాల్(ప్రస్తుతం బంగ్లాదేశ్)లో రైల్వే లైను, టిబెట్ నుంచి ఎద్దుల మీద జూలు దిగుమతి చేసే వ్యాపారం, తూర్పు ఆఫ్రికాలో పత్తి వడికే కర్మాగారం, లండన్‌లో కార్యాలయం వంటి ఎన్నో సంస్థలు, వ్యాపారాలు ఉండేవి. విక్రమ్ పుట్టేనాటికే అతని కుటుంబం అహ్మదాబాద్‌లోని అత్యంత సంపన్నులైన వర్తకులు ఉండే షాహిబాగ్ ప్రాంతంలో 21 ఎకరాల్లో విస్తరించిన “రిట్రీట్” అన్న బంగళాలో నివసించేవారు. విక్రమ్ సారాబాయ్ కుటుంబం దాసశ్రీ మాలి శాఖకు చెందిన జైనులు.

తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు, భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింప చేసింది”భారత అంతరిక్ష రంగ పితామహుడు”గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 31వ తేదీన పరమపదించారు.

గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.

సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.

కుటుంబ నేపథ్యం,
విక్రమ్ సారాభాయ్ కుటుంబం విషయానికి వస్తే…ఇతని భార్య మృణాలిని సారాభాయ్. ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె మల్లికా సారాభాయ్. ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !