★BRS పార్టి మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ
నేటి గదర్ న్యూస్, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సుమారుగా 16 వేల ఎకరాల పొలాలు నీరు లేక ఒక పంట మాత్రమే పండుతున్న పరిస్థితి
ఈ మండలంలో ఉన్న సుమారు 16 వేల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరు అందించి ఇక్కడ రైతులని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ డిమాండ్ చేశారు.
పక్కనే గోదావరి ఉన్న ఇక్కడ పంటలు సరిగా పండిన పరిస్థితి మెట్ట ప్రాంతాలు ఎక్కువ ఉన్నందున నీటి వసతి లేక పంటలు సరిగా పండని పరిస్థితి సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే ఇక్కడ పంటలు బాగా పండుతాయి భూమి విలువ పెరుగుతుంది అని
ఈ మండలంలోని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు .
సంబంధిత మంత్రివర్యులు గాని
అధికారులు మండలంలోని రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనియెడల మండల ప్రజలు భవిష్యత్తులో తగు రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.