పారిశుద్ధ్య నిర్వహణ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లాలో శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులు, మండల ప్రత్యేక అధికారుల సహకారంతో అధికారులు సిబ్బంది గ్రామ ప్రజలతో జిల్లాలోని 469 గ్రామపంచాయతీలలో ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఐదు రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మహిళా యువజన సంఘాలు వార్డ్ కమిటీల సభ్యులతో ర్యాలీలు సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం మొక్కల పెంపకం,వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగే దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రజల్లో గ్రామస్తులు అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాఠశాలలు అంగన్వాడీలు వసతి గృహాలు బస్టాపులలో పారిశుద్ధ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.అదేవిధంగా తాగునీరు వర్షపు నీటి సంరక్షణ మురుగు గుంతల పూడ్చివేత తాగునీటి వనరుల శుభ్రత క్లోరినేషన్ ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర అంశాలపై గ్రామస్తులలో అవగాహన కల్పించడం జరిగింది, సీజనల్ వ్యాధులపై ప్రచార కార్యక్రమాలు సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెన్సివ్ క్లీనింగ్ యాంటీ లార్వా ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి మునగా, కరివేపాకు, మామిడి, ఉసిరి నేరేడు చింత దానిమ్మ వంటి పళ్ళు,ఔషధ గుణాలున్న మొక్కలను పంపిణి చేయడం జరిగిందన్నారు.
ఈ ఐదు రోజుల కార్యక్రమాల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛతనం పచ్చదనం నిర్వహించి రహదారులను శుభ్రం చేయడం జరిగిందని మురుగు కాలువను శుభ్రం చేయడం జరిగిందని ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేయడం జరిగిందని, 293287 ప్రజలను భాగ్యసాములు చేస్తూ శ్రమదాన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తొలగించడం జరిగిందన్నారు ఫ్రైడే డ్రైడేలో భాగంగా గృహాలలో పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. వన మహోత్సవంలో భాగంగా 2 లక్షల మొక్కలను నాటడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.