నేటి గదర్ న్యూస్ ఆగష్టు12:వైరా నియోజకవర్గ ప్రతినిధి,శ్రీనివాసరావు.
కారేపల్లి :ఆగస్టు 15న వైరా నియోజకవర్గం కేంద్రంలో జరుగు రైతు సభలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గంలో గిరిజన సమస్యలను, ప్రజా సమస్యలపై స్పందించి, కారేపల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి మరియు పోడు భూముల సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, కారేపల్లి మండల గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు అజ్మీర శోభన్ నాయక్ , బానోత్ బన్సీలాల్ లు విజ్ఞప్తి చేశారు, వైరా నియోజకవర్గంగా సమగ్రంగా అభివృద్ధి సాధించడం కొరకు విద్యా వైద్యం, ఇల్లు, ఇళ్ల స్థలాలు రోడ్లు అభివృద్ధికి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. ఏజెన్సీ మండలాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కారేపల్లి మండలం గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న కనీసం 50 పడకల ఆసుపత్రి లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ముఖ్యమంత్రి గారు వైరా సభలో కారేపల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని కోరారు. పోడు భూముల సమస్య శాశ్వతంగా పరిష్కారం కోసం మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలుగా గుర్తించిన తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కి కోరారు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం కోసం ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీలు సకాలంలో అమలు చేసి, సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.