నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, ఆగస్టు,12:
ములుగు జిల్లా గట్టమ్మ వద్ద ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం హాస్టల్ ఆవరణలో జిల్లా ఉపాధ్యక్షుడు అనుముల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12 న AISF ఆవిర్భవించింది.
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన – స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం AISF. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్యానంతరం *ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 88 సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా – పోరాటాలే ప్రాణంగా – విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా “చదువుతూ పోరాడుతాం – చదువుకై పోరాడుతాం”అంటూ *తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది AISF. ఇంతటి పోరాట త్యాగాల చరిత్ర కలిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 89వ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు .,వేణు. ప్రవీణ్. రమేష్. నాగరాజ్. 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.