రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మండలంలో ప్రజావాణి ప్రారంభమైన రోజు నుండి ఇప్పటివరకు 236 దరఖాస్తులు రాగా అందులో 138 దరఖాస్తులు పరిష్కారం చేసినట్లు ఆమె తెలిపారు.అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసిల్దార్ కార్యాలయంలో వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు.ఇట్టి అవకాశాన్ని రామాయంపేట మండల ప్రజలు ప్రతి సోమవారం సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియపరచారు.ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది వివిధ శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 58