రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాక్ సెంటర్ ఇన్చార్జి నిజాముద్దీన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట డివిజన్ పరిధిలోని నిజాంపేట, నార్సింగి,చిన్నశంకరంపేట,చేగుంట ఐదు మండలాల నుండి ఆసక్తిగల మహిళలు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ప్రభుత్వపరంగా ఉచితంగా నిర్వహించే కుట్టు శిక్షణ కార్యక్రమంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.ఆసక్తిగల మహిళలు తమ ఆధార్ కార్డు,రేషన్ కార్డు, లేబర్ కార్డు,ఒక ఫోటోతో ఈనెల 20వ తేదీ వరకు న్యాక్ సెంటర్ లో దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.ఈ అవకాశాన్ని వివిధ మండలాలకు చెందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.మిగతా పూర్తి వివరాల కోసం న్యాక్ శిక్షకురాలు భక్తమాల సెల్ 9059443707 కు సంప్రదించాలని సూచించారు.అలాగే శిక్షణ అనంతరం ఉచిత సర్టిఫికెట్ మరియు కుట్టు మిషను అందజేస్తామని ఆయన తెలియపరచారు.