+91 95819 05907

ఏ గ్రామ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి.ఏఈవోలకూ ఇదే వర్తిస్తుంది:మంత్రి పొంగులేటి

★నిద్రలేచింది మొదలు… పనిలో నిమగ్నమవ్వాలి

– ఏ గ్రామ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి

– వ్యవసాయశాఖ ఏఈవోలకూ ఇదే వర్తిస్తుంది

– ఖచ్చితంగా వారి పరిధిలోని క్లస్టర్లోనే ఉండి పనిచేయాలి

– వచ్చే సోమవారం నాటికి ఇది అమలుకావాలి

– గ్రామ కార్యదర్శులపై ఎంపీడీవోల పర్యవేక్షణ తప్పనిసరి

– వారి పనితీరును ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలి

నేటి గద్దర్ న్యూస్, పాలేరు నియోజకవర్గ ప్రతినిధి:

: నిద్రలేచింది మొదలు… పనిలో నిమ్నగమవ్వాలి.. ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉండి పనిచేయాలి… అప్పుడే గ్రామంలో నెలకొన్న సమస్యలు… స్థానిక స్థితిగతులపై పట్టుకలిగి ఉంటారు… పాలేరు నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న పలు పంచాయతీ కార్యదర్యులపై ఫిర్యాదుల అందాయి… మొదటి తప్పుగా మందలించి వదిలేయడం జరుగుతుంది. ఇదే పునరావృతం అయితే ఊరుకునేది లేదు… వారికి ట్రాన్స్ ఫర్ అనేది ఉండదు… శాఖాపరమైన చర్యలకు పూనుకోవాల్సి ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గ్రామ కార్యదర్శులను హెచ్చరించారు. అలాగే వ్యవసాయ శాఖ ఏఈవోలు కూడా వారు పనిచేసే క్లస్టర్ పరిధిలోనే నివాసం ఉండాలని సూచించారు. ఓ గ్రామంలో నివాసం ఉంటూ మరో గ్రామంలో లేదా వేరే మండలం నుంచి ఇంకో మండలంలోని ఏదైనా గ్రామంలో పనిచేసే వారు తక్షణమే వారు పనిచేసే గ్రామాలకు నివాసం వెళ్లాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా ఇది అమలు కావాలని డీపీవోకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఖరీప్ పంటల సాగు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత నియోజకవర్గంలోని మేజర్ గ్రామ పంచాయతీలకు చెందిన కార్యదర్శుల నుంచి ఆయా గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశ అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ప్రతి గ్రామ పంచాయతీల్లో డైనమిక్ గా పనిచేసే కార్యదర్శులను నియమించాలన్నారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో అవసరాన్ని బట్టి మరో పంచాయతీ కార్యదర్శిని కూడా నియమించాలని సూచించారు. రాబోవు ఏడాదిలోపు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్య తీరుతుందని… అత్యవసరమైనవి తన దృష్టికి తెస్తే తక్షణమే నిర్మాణం చేపట్టేలా చూస్తానని పేర్కొన్నారు. పలువురు సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి పాఠశాలలకు 200మీటర్ల లోపు కూడా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారని వాటి వివరాలను సేకరించి వారిపై చర్యలకు ఉపక్రమించాలని సంబంధిత అధికారులను
ఆదేశించారు.

– *ప్రజలను వేధిస్తే…. టార్గెట్ చేస్తా…*

ఎవరి పని వారు చేసుకుంటూ పోతే ఎవరిని మందలించనని… కానీ ఏదైనా పనికోసం ప్రజలు ఆయా గ్రామల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఆ పనిచేయకుండా వారి దగ్గర ఏదైనా ఆశించి ఇబ్బందులకు గురిచేసినట్లు తన దృష్టికి వస్తే ఆ సిబ్బందిని కానీ ఆ అధికారిని కానీ ఖచ్చితంగా టార్గెట్ చేస్తానని హెచ్చరించారు. ఆయా గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుల, వృద్ధాప్య, వితంతు మొదలగు పెన్షన్ కు అర్హులైన వారిని గుర్తించాలని, అనర్హులకు ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వొద్దని అన్నారు. అర్హులకు ఎంతమందికి ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని…. పొరపాటున ఒక అనర్హుడికి ఇచ్చినా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆ అనర్హుడిని ఉదాహరిస్తూ అర్హత లేని వారు ఇంకెందరో పెన్షన్ తమకూ ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తారన్నారు. కావున వాటి మీద దృష్టి సారించాలని కార్యదర్శులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అంగన్ వాడీలు, ఆశావర్కర్లను సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ తన సొంత ఖర్చుతో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తానని త్వరలోనే అవి పూర్తవుతాయని తెలిపారు. వ్యవసాయశాఖ సిబ్బందితో మాట్లాడుతూ…. రైతు రుణమాఫీ ఎంతమందికి అందింది… ఇంకెంతమందికి అందాలనే జాబితాను రూపొందించాలన్నారు. అందనివారికి ఏ రిమార్క్ కింద అందలేదో అనేది కూడా చెప్పాలన్నారు. పామాయిల్ సాగు, ఖరీప్ పంటలపై దృష్టిసారించాలని సూచించారు. రైతు వేదికల వద్ద రైతు సోదరులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవో, డీఎల్ పీవో, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు, ఇతర శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !