రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట సోమవారం రోజు రాష్ట్ర సర్వ శిక్ష జేఏసీ పిలుపు మేరకు సర్వ శిక్ష అభియాన్ లో మరణించిన ఉద్యోగులకు నివాళులు అర్పించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను భద్రత లేనందున తక్కువ వేతనంతో పాటు పని ఒత్తిడి పెరిగి కుటుంబ భారాన్ని మోయలేక మానసికంగా ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. గత పది సంవత్సరాలలో చాలామంది మరణించడం జరిగిందని,ఈ విషయంలో ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని పేర్కొన్నారు.ఉద్యోగస్తులకు బేసిక్ పే ఇవ్వాలని,తక్షణమే మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వపరంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు మానవత దృక్పథంతో ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని యెడల తాము దశలవారీగా సమ్మెకు పిలుపునిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షులు రాజు కనకరాజు, సంతోష్, శ్రీకాంత్, రజిత,వినోద,తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.